పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో పనులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ తదితరులు పరిశీలించారు.