కుల వివక్షత, అంటరానితనంపై పౌర హక్కుల దినోత్సవం

1చూసినవారు
కుల వివక్షత, అంటరానితనంపై పౌర హక్కుల దినోత్సవం
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం వెంకట్రావు పల్లె గ్రామంలో శుక్రవారం  సర్పంచ్ చల్ల నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న అంటరానితనం, కుల వివక్షత, అత్యాచారాలపై పౌర హక్కుల దినోత్సవం గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, కులం పేరుతో అత్యాచారాలు, వివక్షత చూపడం చట్టరీత్యా నేరమని, ప్రతి నెలా చివరి తేదీన ఒక గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం జరుపుకోవడం ద్వారా గ్రామాల్లో కులాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్