కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్చార్జిగా వెలిచాల రాజేందర్ రావు నియామకం పార్టీలో తీవ్ర విభేదాలకు దారితీసింది. పలువురు నాయకులు ఈ నియామకాన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. తమ ప్రమేయం లేకుండా తమ పేర్లతో వినతిపత్రం సమర్పించారని సర్పంచులు, మాజీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నాహక సమావేశంలోనే ఈ విభేదాలు బయటపడటంతో పార్టీ శ్రేణులు గందరగోళంలో పడ్డాయి.