కొండగట్టులో విరాళాల సేకరణ సరే.. టోకెన్ల ఇష్యూ ఎక్కడ..

0చూసినవారు
కొండగట్టు అంజన్న ఆలయంలో అన్నదాన ట్రస్టుకు విరాళాలు సేకరించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినా, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్నదానం టోకెన్లు ఎక్కడ జారీ చేస్తారో తెలియక గందరగోళం నెలకొంది. దీనివల్ల చాలామంది భక్తులకు అన్నప్రసాదం అందడం లేదని విమర్శలు వస్తున్నాయి. విరాళాల సేకరణపై ఉన్న శ్రద్ధ అన్నదానంపై లేదని భక్తులు మండిపడుతున్నారు. టోకెన్ల జారీపై స్పష్టత ఇచ్చి అన్నదానం సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్