కరీంనగర్ కలెక్టరేట్ లో ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రద్దు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసేంతవరకు ఈ కార్యక్రమం ఉండదని, కోడ్ ముగిసిన తర్వాత యధావిధిగా కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.