కరీంనగర్లో కళాశాలల బంద్ విజయవంతం*

0చూసినవారు
కరీంనగర్లో కళాశాలల బంద్ విజయవంతం*
కరీంనగర్ జిల్లాలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పాత పద్ధతిలోనే అమలు చేయాలని, బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కళాశాలల బంద్ గురువారం విజయవంతంగా ముగిసింది. ప్రైవేట్ కళాశాలలు స్వచ్ఛందంగా పాల్గొనగా, ప్రభుత్వ కళాశాలలను బంద్ చేయించారు. జీఓ 9ను రద్దు చేసి పాత పద్ధతిలోనే అమలు చేయాలని, లేనిపక్షంలో నిరంతర ఆందోళనలు చేపడతామని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాష్, నాగుల కనకయ్య గౌడ్, బీసీ సంఘాల నాయకులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్