రాజన్న సిరిసిల్ల జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, ఇల్లంతకుంట మండలం, వల్లంపట్ల గ్రామంలో ప్రజల సౌకర్యార్థం, పనులు త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో లింగంపెల్లి రాజు, ఆళ్ళ సంతోష్ రెడ్డిలు కంప్యూటర్, ప్రింటర్, జిరాక్స్, స్కానర్‌లను గ్రామ పంచాయతీకి అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నేరెళ్ళ విజయ్, ఉపసర్పంచ్ వంశీ, కార్యదర్శి తిరుపతితో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. సర్పంచ్, పాలక వర్గం వారికి కృతజ్ఞతలు తెలిపారు.