నూతన సంవత్సరం సందర్భంగా కరీంనగర్ జిల్లా సహకార అధికారి ఎస్. రామానుజాచార్య, సహకార శాఖ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అసోసియేషన్ రూపొందించిన టేబుల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, సహకార శాఖ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా సహకార అధికారి ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.