కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్యాధికారులను ఆదేశించారు. సీఎస్ఆర్ కింద హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కంపెనీ రూ.2.3కోట్ల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను అందించింది. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. మానవ తప్పిదాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ట్రాఫిక్ నియమాలు పాటిస్తే వాటిని నియంత్రించవచ్చని, రోడ్డు భద్రతపై 20వేల మందికి పైగా విద్యార్థులకు అవగాహన కల్పించామని కలెక్టర్ తెలిపారు.