లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో బుధవారం రాంనగర్ ప్రభుత్వ పాఠశాలలో పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజల బాధ్యత కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా 49వ డివిజన్ కార్పొరేటర్ ఎన్నం లక్ష్మీ ప్రకాష్ పాల్గొని కార్యక్రమంలో భాగంగా పిల్లలకు కంపక్స్, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, చాక్లెట్లు పంచడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయులకు ప్లాస్టిక్ ను నిర్మూలించాలని బట్ట బ్యాగులను పంపిణీ చేశారు. అలాగే పర్యావరణాన్ని కాపాడాలని పాఠశాల ప్రాంగణంలో చెట్లను నాటారు.