కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో మున్సిపల్ అధికారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతిని అరికట్టాలని, నిబంధనల ప్రకారం ఇళ్ల అనుమతులను సులభతరం చేయాలని ఆయన ఆదేశించారు. నిజాయితీగా పనిచేసే అధికారులకు అండగా ఉంటానని, అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. "ఇప్పటిదాకా ఒక లెక్క. ఇకపై మరో లెక్క" అని ఆయన పేర్కొన్నారు.