
రెండేళ్లలో 150% పెరిగిన ప్రోటీన్ ఉత్పత్తుల ఆర్డర్లు
భారతదేశంలో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో ప్రోటీన్ ఆహారాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. గత రెండేళ్లలో ప్రోటీన్ ఉత్పత్తుల ఆర్డర్లు 150% పెరిగాయి, వినియోగదారుల ఖర్చు మూడు రెట్లు పెరిగింది. గుడ్లు, చీజ్, చికెన్, మఖానా, ఓట్స్, గ్రీక్ యోగర్ట్, ప్రోటీన్ బార్లు, శనగలు వంటి సాంప్రదాయ, కొత్త రకాల ప్రోటీన్ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. ప్రోటీన్ చిప్స్, యోగర్ట్ అమ్మకాలు గణనీయంగా వృద్ధి చెందాయి. ప్రజలు ఇప్పుడు ప్రోటీన్‌ను రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగంగా చూస్తున్నారు.




