బోయినపల్లి తహసీల్ కార్యాలయని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

బోయినపల్లి మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. హాజరు రిజిస్టర్, భూ భారతి రిజిస్ట్రేషన్ గది, కార్యాలయాన్ని పరిశీలించి, అధికారులకు, సిబ్బందికి సూచనలు జారీ చేశారు. కార్యాలయానికి వచ్చే వారికి సేవలు అందించాలని, స్లాట్ బుక్ చేసుకున్న వారికి అందుబాటులో ఉండాలని, రిజిస్ట్రేషన్లు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో తహసీల్దార్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
