సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా ఎస్పీ మహేష్ బి గితే, జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన పోలీసు అధికారులు ఈ సందర్భంగా రంగులు చల్లుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా సహచర పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి జిల్లా ఎస్పీ డాన్స్ చేశారు. ఎస్పీ వేసిన స్టెప్పులు పోలీసు అధికారులలో మరింత ఉత్సాహాన్ని నింపాయి.