ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్కు చెందిన హనుమాన్ దీక్షాపరులు మాల విరమణ కోసం కొండగట్టుకు పాదయాత్రగా బయలుదేరారు. మార్గమధ్యంలో వారికి బిస్కట్ ఇచ్చిన ఒక శునకం వారితోనే సాగింది. ఐదు రోజుల పాటు సుమారు 130 కిలోమీటర్లు నడిచిన ఆ శునకానికి కాళ్ల నొప్పులు రావడంతో భక్తులు దానికి సాక్సులు తొడిగారు. వెళ్లగొట్టినా తిరిగి వారితోనే చేరిన ఆ శునకం, శుక్రవారం కొండగట్టుకు భక్తులతో కలిసి చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది.