హోళీ పండుగ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏటా జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సరదా కోసం చేసే చిన్న పొరపాట్లు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో, కాలువలు, మానేరు వాగు, లోయర్ మానేరు డ్యాం వంటి జలవనరుల వద్ద స్నానాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సరదాగా గడిపే వేడుకల్లో జాగ్రత్తలు పాటించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.