సద్దుల బతుకమ్మ నిర్వహణపై సందిగ్ధత

14చూసినవారు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సద్దుల బతుకమ్మ పండగ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. కొందరు పండితులు సోమవారం పండగ నిర్వహించాలని సూచిస్తుండగా, మరికొందరు మంగళవారం నిర్వహించాలని చెబుతున్నారు. క్యాలెండర్ ప్రకారం దుర్గాష్టమి మంగళవారం ఉన్నప్పటికీ, పండగను సోమవారమే జరపాలని కొందరు వాదిస్తున్నారు. దీనిపై ఇప్పటికే గ్రామాల్లో ప్రచారం జరుగుతుండటంతో మహిళల్లో అయోమయం నెలకొంది. ఈ సందిగ్ధత దసరా పండగ నిర్వహణపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :