దేవుడిని ఆరాధించడం వలన సకల బాధల నుండి విముక్తి పొంది సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించగలుగుతామని
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. తడగొండలోని పోచమ్మ ఆలయంలో పోచమ్మ తల్లికి సారెను సమర్పించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భక్తి శ్రద్ధలతో దేవతలను కొలిస్తే మానసిక ప్రశాంతతతో పాటు సమాజంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విఎన్ఆర్ ఫౌండేషన్ సభ్యులు దయ్యాల రాజశేఖర్, ఆలయ అర్చకులు సాయిరాం శర్మ తదితరులు పాల్గొన్నారు.