మిడ్ మానేర్ నుండి తాగునీటి విడుదల: దిగువ గ్రామాలకు అప్రమత్తత హెచ్చరిక

0చూసినవారు
మిడ్ మానేర్ నుండి తాగునీటి విడుదల: దిగువ గ్రామాలకు అప్రమత్తత హెచ్చరిక
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం నుండి, ఉన్నతాధికారుల సూచనల మేరకు, మిడ్ మానేర్ రిజర్వాయర్ రేడియల్ గేట్ల నుండి గురువారం ఉదయం 9:00 గంటలకు ఎల్.ఎం.డి రిజర్వాయర్‌కు తాగునీటి కోసం 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో, దిగువ గ్రామాలకు సంబంధించిన పోలీసు, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా వారు గ్రామస్తులను అప్రమత్తం చేయాలని, నదిలో ఉన్న మోటార్లను తొలగించాలని, పశువులను నది దగ్గరకు రాకుండా చూడాలని కోరడమైనది. ఈ సమాచారం తదుపరి అవసరమైన జాగ్రత్తల కోసం ఉద్దేశించబడింది.

సంబంధిత పోస్ట్