
ఆస్తి కోసం పెద్దమ్మను చంపిన రౌడీషీటర్!
TG: ఆస్తి వివాదం నేపథ్యంలో ఓ రౌడీషీటర్ తన సొంత పెద్దమ్మ మోటె రాములమ్మ(70)ను కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన ఖమ్మం పట్టణంలో గురువారం జరిగింది. మోటె యాదగిరి కుటుంబానికి వారి స్వగ్రామం యాదాద్రి భువనగిరి(D) వలిగొండ(M) నాతర్లగూడెం 27 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి వివాదం కోర్టులో కొనసాగుతోంది. యాదగిరి సోదరుల్లో ఒకరైన వీరయ్య కుమారుడు శేఖర్, తన పెద్దమ్మ రాములమ్మను వివాదం ముగించి తనకు భూమి ఇప్పించాలని కోరుతున్నాడు. పరిష్కారం లభించకపోవడంతో రాములమ్మపై కత్తితో దాడి చేసి చంపాడు.




