స్థానిక సంస్థల స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పైరవీలు ఊపందుకున్నాయి. రిజర్వేషన్ అనుకూలంగా వచ్చిన ఆశావాహులు స్థానిక మంత్రి, ఎంపీ, ఎంఎల్ఏ లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఎలాగైనా బీ ఫామ్ దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీకి చేసిన సేవలు, ఆర్థిక వనరులు తోపాటు బలాబలాలను నేతల దగ్గర ఏకరువు పెట్టుకుంటున్నారు.