మంచిర్యాల జిల్లా గుడిపేట 13వ బెటాలియన్‌లో ఈ నెల 16 నుంచి 22 వరకు నిర్వహించిన ‘ఆపద మిత్ర’ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శిక్షణ మంగళవారం ముగిసింది. విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స, రక్షణ చర్యలపై వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కమాండింగ్ ఆఫీసర్ కె. వెంకటేశ్వర్లు పాల్గొని వాలంటీర్లకు సూచనలు చేశారు. ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల నుంచి 67 మంది వాలంటీర్లు శిక్షణలో పాల్గొన్నారు. అనంతరం వాలంటీర్లకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కిట్లు, సర్టిఫికెట్లు అందజేశారు.