ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణ బోర్డు ఏర్పాటు చేయండి

9చూసినవారు
ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణ బోర్డు ఏర్పాటు చేయండి
కరీంనగర్ జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఫీజుల నియంత్రణ బోర్డులను ఏర్పాటు చేయాలని బీసీ సంఘం, అనుబంధ సంఘాల నాయకులు శుక్రవారం డీఈఓ మాధవికి వినతిపత్రం అందజేశారు. పాఠశాలల్లో ఫీజుల వివర బోర్డులు ఏర్పాటు చేస్తే విద్యార్థుల తల్లిదండ్రులకు అడ్మిషన్ ఫీజు, వార్షిక ఫీజులపై స్పష్టత ఉంటుందని, చెల్లింపులు సులభమవుతాయని వారు పేర్కొన్నారు. ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తుండటంతో మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని నియంత్రణ చర్యలు చేపట్టాలని వారు కోరారు.

ట్యాగ్స్ :