చింతకుంట 14వ, 15వ డివిజన్లకు సంబంధించిన రైతుల ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని కొత్తపల్లి మండల వ్యవసాయ విస్తరణ అధికారి శుక్రవారం చేపట్టారు. ఇంకా నమోదు కాని రైతులు నగరపాలక సంస్థ కార్యాలయం (గ్రామపంచాయతీ) చింతకుంటకి కావలసిన పత్రాలతో వచ్చి నమోదు చేసుకోవాలని సూచించారు.