రైతు నమోదు తప్పనిసరి - కొత్తపల్లి ఏఈఓ ఫజిల్

2141చూసినవారు
రైతు నమోదు తప్పనిసరి - కొత్తపల్లి ఏఈఓ ఫజిల్
రైతుల ఎరువుల బుకింగ్, రైతు భరోసా, పిఎం కిసాన్ తదితర సేవలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా రైతు నమోదు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని కొత్తపల్లి, చింతకుంటల వ్యవసాయ విస్తరణ అధికారి ఫజిల్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోని రైతులు వెంటనే మీ ఆధార్ కార్డు, పట్టాబుక్కు, ఆధార్ లింక్ ఉన్న ఫోన్లతో కొత్తపల్లి రైతు వేదికకు వచ్చి లేదా మీకు సమీపంలో ఉన్న మీసేవ లేదా CSC కేంద్రాల్లో కూడా ఫార్మర్ రిజిస్ట్రీ (రైతునమోదు) చేయించుకోవచ్చన్నారు,

సంబంధిత పోస్ట్