బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలోని గూగుల్ గుట్ట పరిసరాల్లో సుమారు 35 ఎకరాల పరంపోగు భూమిలో 5 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గ్రామ రైతులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఐకేపీ ధాన్యం నిల్వకు స్థలం సరిపోకపోవడంతో, పరంపోగు భూమిని రైతుల అవసరాలకు వినియోగించేందుకు సర్వే నిర్వహించాలని, ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని రైతులు విజ్ఞప్తి చేశారు.