బోయినపల్లి ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు సిరిసిల్ల కలెక్టరేట్‌లో సివిల్ సప్లై అధికారులను కలిసి, బోయినపల్లిలో రైస్ మిల్లుల్లో ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని, అందుకు ఎక్కువ లారీలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వినోద్ రెడ్డి, నాయకుడు నగేష్ కూడా పాల్గొన్నారు.