రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

4చూసినవారు
రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్
కరీంనగర్ జిల్లాలో సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ వారం 3,163 మెట్రిక్ టన్నుల యూరియాను సొసైటీల ద్వారా అందుబాటులోకి తెచ్చామని, మరో 2,616 మెట్రిక్ టన్నులు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని, డిమాండ్‌ను బట్టి మరిన్ని నిల్వలు తెప్పిస్తామని ఆమె స్పష్టం చేశారు.