తిమ్మాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

680చూసినవారు
తిమ్మాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం శ్రీ చైతన్య పాఠశాల సమీపంలో ప్రధాన రహదారిపై కరీంనగర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న మహేంద్ర తార్ వాహనం అతివేగంతో కల్వర్టు గోడను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో వాహనం నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్