తుంగకు నిప్పు, వరిపంటకు ముప్పు: సకాలంలో అగ్నిమాపక సిబ్బందితో సర్పంచ్ ఆదుకున్నారు

728చూసినవారు
తుంగకు నిప్పు, వరిపంటకు ముప్పు: సకాలంలో అగ్నిమాపక సిబ్బందితో సర్పంచ్ ఆదుకున్నారు
కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లి గ్రామ శివారులో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు తుంగకు నిప్పు అంటించడంతో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న వరి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు సర్పంచ్ పొన్నం సునీత - అనిల్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సర్పంచ్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో, వారు సకాలంలో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ సంఘటనలో ఎలాంటి పంట నష్టం జరగలేదు. ఎండాకాలంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించే ప్రమాదాలను ముందుగా గుర్తిస్తే నష్టాలను తగ్గించుకోవచ్చని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you