గొల్లపల్లి మాజీ సర్పంచ్ అంజయ్య యాదవ్ బీఆర్ఎస్ లో చేరిక

736చూసినవారు
గొల్లపల్లి మాజీ సర్పంచ్ అంజయ్య యాదవ్ బీఆర్ఎస్ లో చేరిక
తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మల్లెత్తుల అంజయ్య యాదవ్ కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, కాంగ్రెస్ హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, తిమ్మాపూర్ మాజీ వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్