గంగాధర మండలంలోని ముప్పిడిపల్లి, బూరుగుపల్లి గ్రామాలలో శనివారం స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రోడ్డును ఊడ్చి, శ్రమదానం చేశారు. సుంకె రవిశంకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో సమస్యలు తిష్ఠ వేశాయని, అధికారులు ఆవైపు కన్నెత్తి కూడా చూడటం లేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆయన పరోక్షంగా ఎత్తిచూపారు.