మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు

790చూసినవారు
మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామంలో గురువారం జరిగిన పెద్దమ్మ తల్లి జాతర బోనాల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ఆయన కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్థానిక సర్పంచ్ బద్దం శేఖర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సన్మానించారు. తర్వాత ఇల్లంతకుంట మండల కేంద్రంలో పలు వివాహ కార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్