
ఏనుగుల గుంపు హల్చల్ (వీడియో)
AP: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. దాంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఏనుగులను రెచ్చగొట్టవద్దని, దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. నష్టపరిహారం కోసం అధికారులను సంప్రదించాలని, అడవిలోకి తోలేందుకు గ్రామస్తులు సహకరించాలని అధికారులు కోరారు.




