కరీంనగర్ జిల్లాలో తరచుగా దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. మహమ్మద్ గౌస్ బాబా, మహమ్మద్ అబీద్, దొబ్బల పవన్, సుధాకర్ అనే నిందితులు కలెక్టరేట్ గేటు వద్ద ఒక వ్యక్తిని బెదిరించి ₹3000 నగదును దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు సీఐ రామచందర్ రావు తెలిపారు.