కరీంనగర్‌లో మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురు వ్యక్తులకు కోర్టు జైలు శిక్షలు విధించింది. బొమ్మకంటి ప్రవీణ్ కుమార్‌కు 14 రోజుల జైలు శిక్ష, మామిడి కమల్, సయ్యద్ మజీద్, గుంజ సాగర్‌లకు 7 రోజుల చొప్పున జైలు శిక్ష పడింది. పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన వీరిని న్యాయస్థానం ముందు హాజరుపరచగా, నేరం రుజువవడంతో న్యాయమూర్తి ఈ శిక్షలు విధించారు.