రామడుగు మండలం వెలిచాల గ్రామంలో, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో, వీవీఆర్ ఫౌండేషన్ సహకారంతో మహిళలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని సర్పంచ్ వీర్ల నర్సింగరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వీర్ల రవీందర్ రావు, ఉప సర్పంచ్ ఎల్లమల్ల వసంత, వీవీఆర్ ఫౌండేషన్ డైరెక్టర్ బంధారపు అజయ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ శిక్షణ ద్వారా మహిళలు ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సర్పంచ్ ఆకాంక్షించారు. వీర్ల వెంకటేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు.