కరీంనగర్ లోని రెనే హాస్పిటల్, శ్రీ లక్ష్మి మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన 6వ ఉచిత మోకాలి కీలు మార్పిడి శిబిరంలో ఎంపికైన 18 మందికి శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయి. 600 మంది నుండి లక్కీ డ్రా ద్వారా ఎంపికైన వారికి, 8 మందికి అత్యాధునిక రోబోటిక్ విధానంలో, మిగతా వారికి సాధారణ పద్ధతిలో ఆపరేషన్లు ఉచితంగా చేశారు. ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని సుమారు 40 లక్షల విలువైన వైద్యం అందించడాన్ని డాక్టర్ బంగారు స్వామి అభినందించారు. ఈ 18 మందిని నేడు డిశ్చార్జ్ చేశారు.