లంపీ స్కిన్ వైరస్ నివారణకు ఉచిత టీకాలు

0చూసినవారు
లంపీ స్కిన్ వైరస్ నివారణకు ఉచిత టీకాలు
ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామంలో పశువుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా లంపీ స్కిన్ వైరస్ నివారణకు ఉచిత టీకాల కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వొల్లాల రజిత వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆవులు, లేగదూడలకు టీకాలు వేశారు. పశువుల ఆరోగ్యం, రైతుల ఆర్థికాభివృద్ధికి టీకాలు తప్పనిసరి అని సర్పంచ్ వొల్లాల రజిత వెంకటేష్ సూచించారు. పశుసంవర్ధక శాఖ డాక్టర్ పూర్ణచంద్రిక, పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు చిట్టి వెంకట రాజిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్