కొడిమ్యాల మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొహినుద్దీన్, బాధితుడి నుంచి రూ. 80 వేల లంచం తీసుకుంటుండగా కరీంనగర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ నేతృత్వంలోని బృందం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఈ సంఘటనతో అటవీశాఖలో అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు.