జమ్మికుంటలోని చారిత్రాత్మక నాయిని చెరువు రాజకీయ నాయకుల అండతో అక్రమార్కుల చెరలో చిక్కుకుంది. 289 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువులో సుమారు 80 ఎకరాలు కబ్జాకు గురైంది. అభివృద్ధి పేరిట నాణ్యత లేని పనులు, అధిక బిల్లులు చూస్తుంటే నిధుల దుర్వినియోగం జరుగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.