గంగాధర మండల కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, కాంటాలు పెట్టకపోవడంపై ఆగ్రహించిన రైతులు ట్రాక్టర్లతో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. వర్షాలకు ధాన్యం తడుస్తోందని, మిల్లర్లు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు, తక్షణమే ధాన్యం కొనుగోలు చేసి లారీలు పంపాలని డిమాండ్ చేశారు. పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.