కళాశాల పక్కనే చెత్త దహనం.. విద్యార్థినులు అస్వస్థత

2431చూసినవారు
కరీంనగర్ ఉస్మాన్పురా ప్రభుత్వ కళాశాల విద్యార్థినులు అస్వస్థతకు గురవ్వడానికి కారణాన్ని ప్రిన్సిపల్ నిర్మల వివరించారు. కళాశాల పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చెత్తను కాల్చడం వల్ల వ్యాపించిన పొగతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. స్టడీ అవర్లో చదువుకుంటున్న సమయంలో ఐదుగురు విద్యార్థినులు ఒక్కొక్కరుగా కింద పడటంతో వారిని ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని ఆమె వెల్లడించారు.

సంబంధిత పోస్ట్