ఇల్లంతకుంట మండలం, గొల్లపల్లి చింతకుంటపల్లె గ్రామంలో గురువారం రైతుల పశుసంపదను రక్షించేందుకు గ్రామ సర్పంచ్ రడం లక్ష్మి (ప్రవీణ్) ఆధ్వర్యంలో లంపీ స్కిన్ వైరస్ నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ఆవులు, లేగదూడలకు ఉచితంగా లంపీ వైరస్ నిరోధక టీకాలు వేశారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ రైతుల ఆర్థికాభివృద్ధికి ముఖ్యమని, ప్రతి రైతు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సర్పంచ్ సూచించారు.