కరీంనగర్ పట్టణంలో మహిళలు ఆషాడ మాసం పురస్కరించుకొని శనివారం గోరింటాకు పండుగ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తెలుగు వెలుగు సాహితి వేదిక జిల్లా అధ్యక్షురాలు శారద, చేనేత రాష్ట్ర మహిళా విభాగం కోశాధికారి హేమలత, ఉపాధ్యక్షురాలు శాంతి మాట్లాడుతూ గోరింటాకు పండుగ గురించి వివరించారు. ఈ సందర్భంగా చొప్పదండి జ్ఞాన సరస్వతి సేవాదళ్ నిర్వాహకురాలు దండే రమాదేవిని ఘనంగా సన్మానించారు.