కరీంనగర్ జిల్లా గ్రానైట్ ఫ్యాక్టరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ఎత్తున ర్యాలీ తీసి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అంతర్జాతీయంగా యుద్ధాలు, అంతర్జాతీయ పరిస్థితుల వల్ల తమ గ్రానైట్ వ్యవస్థ రోజురోజుకు పడిపోతుందని, ఇలాంటి సమయంలో వచ్చే లాభాలలో 65% టాక్స్ల రూపంలో కడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రూ 25 లక్షలు బిజినెస్ అయ్యే గ్రానైట్ ఫ్యాక్టరీలు.. ప్రస్తుతం రెండు లక్షల కూడా అవటం లేదన్నారు.