శనివారం బాబు జగ్జీవన్ రావు వ్యవసాయ కళాశాల, జగిత్యాల కరీంనగర్ ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సదస్సులో బోయినపల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన గుడి శ్రీనివాసరెడ్డిని అభ్యుదయ రైతుగా సన్మానించారు. ఈ సందర్భంగా, వివిధ పంటల సాగులో నూతన మెలుకువలు, సాంకేతిక సమగ్ర యాజమాన్య పద్ధతులపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. శ్రీనివాసరెడ్డి శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని రైతులకు సూచించారు.