కరీంనగర్ నగరంలో గుంతల రోడ్ల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా జనరల్ ఆసుపత్రి ముందున్న గుంతలు రోగులకు, అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లకు కూడా ప్రమాదకరంగా మారాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు, జ్యోతినగర్ సెయింట్ జాన్ స్కూల్ వంటి ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ ప్రమాదకరంగా ఉన్నాయని మంగళవారం ప్రజలు ఆరోపిస్తున్నారు. చిన్నపాటి వర్షానికే గుంతల్లో నీరు చేరి ప్రమాదాలకు దారితీస్తోంది.