బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో ఘనంగా హోళీ వేడుకలు జరిగాయి. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రంగుల కాంతులతో ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లి స్నేహసౌభ్రాతృత్వాన్ని పంచుకున్నారు. గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య, ఉపసర్పంచ్ పొత్తూరి శైలజ, గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఉత్సాహంగా, సంతోషకరంగా కొనసాగాయి. ఈ వేడుకలు గ్రామ ఐక్యతకు నిదర్శనంగా నిలిచాయి.