మల్యాల లో భార్యను చంపి భర్త ఆత్మహత్య

4చూసినవారు
మల్యాల లో భార్యను చంపి భర్త ఆత్మహత్య
మల్యాల మండలం నూకపల్లి గ్రామంలో సోమవారం ఉదయం వోలపు నాగరాజు తన భార్య లక్ష్మిని ఉరివేసి హత్య చేశాడు. అనంతరం, నాగరాజు కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సర్పంచ్ చెవులమద్ది శ్రీనివాస్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్